పెట్రోల్, డీజిల్ కొరత లేదు వరంగల్ కమిషనర్ Sun Preet Singh

March 26, 2026 11:44 AM

నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ Sun Preet Singh స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురై పెట్రోల్ బంకులకు భారీగా తరలివెళ్తున్నారని తెలిపారు. దీంతో అనవసర రద్దీ ఏర్పడి సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతున్నదని పేర్కొన్నారు

.కమిషనరేట్ పరిధిలోని అన్ని పెట్రోల్ బంకుల్లో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదన్నారు.ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని, సోషల్ మీడియాలోని అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు. వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media