TG:రంగారెడ్డిలో రూ.60 లక్షల నాన్ డ్యూటీ మద్యం ధ్వంసం video

March 26, 2026 11:51 AM

జిల్లాలో ఎక్సైజ్ అధికారులు భారీగా నాన్ డ్యూటీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. సుమారు రూ.60 లక్షల విలువైన మద్యం బాటిళ్లను శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద నాశనం చేశారు.

గత ఆరు నెలల్లో నమోదైన 103 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 6,859 మద్యం బాటిళ్లు, 44 బీరు బాటిళ్లను పంచుల సమక్షంలో రోలర్‌తో ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ P. Dasarath మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తోందని తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media