ఏపూరులో ఉచిత పశువైద్య శిబిరం.. రైతులకు కీలక సూచనలు

March 26, 2026 12:14 PM

రాపూరు మండలం ఏపూరు గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ సౌజన్యంతో, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ శిబిరంలో పశువైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ B. V. Suresh పాల్గొని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చూలు కట్టని పశువులకు ప్రత్యేక చికిత్సలు, కృత్రిమ గర్భధారణ సేవలు అందించారు.ట్రిపుల్ ఎస్ కార్యక్రమం ద్వారా పెయ్య దూడల ఉత్పత్తి పెంపు, పాల ఉత్పత్తి వృద్ధిపై రైతులకు అవగాహన కల్పించారు. వేసవిలో పశుగ్రాస కొరత నివారణకు యూరియా ట్రీటెడ్ ప్యాడీ స్ట్రా, సూపర్ నేపియర్ పశుగ్రాసాల సాగు వంటి పద్ధతులను అనుసరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, పాడి రైతులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media