టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో భూవివాదాలు, రాజకీయ వేధింపులు, ఉద్యోగాలు, సంక్షేమ సమస్యలపై ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి.
తమ భూములను సాగు చేసుకోనివ్వడం లేదని, స్థానిక నాయకుల ఒత్తిడితో అధికారులు సహకరించడం లేదని పలువురు బాధితులు ఆరోపించారు. కొందరు ఆక్రమణలు, దాడులు, నకిలీ పత్రాలతో భూములపై అక్రమాలు జరుగుతున్నాయని వినతులు సమర్పించారు.విజయ డెయిరీలో కార్మికులు, పాడి రైతులపై రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని కూడా ఫిర్యాదులు అందాయి. పింఛన్లు, రేషన్, ఇళ్ల నిర్మాణాలు, ఉద్యోగాల అంశాలపై కూడా పలువురు నేతలకు అర్జీలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రవాణా, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
