ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న Kanaka Durga అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా విశేష పూజలు ఘనంగా నిర్వహించారు.
చివరి రోజు కావడంతో మరువ, మల్లె, సంపెంగ, గులాబీ, తెల్ల మరియు ఎర్ర చామంతి పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అమ్మవారు అమృతవల్లిగా దర్శనమిచ్చారు.వైదిక ఆచారాల ప్రకారం చండీ సప్త స్తుతి పారాయణతో పాటు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజలు జరిగాయి. వసంత కాలంలో లభించే పుష్పాలతో అమ్మవారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని పండితులు తెలిపారు.

