అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నగరంలో తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ టీషర్ట్, జీన్స్ ధరించి హెల్మెట్‌తో బైక్‌పై స్వయంగా నగర వీధుల్లో తిరిగి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.

పవర్ ఆఫీస్ సమీపంలోని మస్టర్ పాయింట్‌ను తనిఖీ చేసి పారిశుద్ధ్య కార్మికుల హాజరు, రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను ఆరా తీశారు. కొంతమంది రెగ్యులర్ ఉద్యోగుల స్థానంలో బదిలీ వర్కర్లు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం ఓల్డ్ టౌన్ ప్రాంతంలో చెత్త నిర్వహణ, డ్రైనేజీ పరిస్థితులను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.నగరంలో పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో కచ్చితంగా పని చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఇకపై తరచూ ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తానని తెలిపారు.
