హనుమాన్ దేవాలయ నిర్మాణానికి ముస్లిం దాత సహకారం..

March 26, 2026 1:29 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఇంద్రారెడ్డి కాలనీలో హనుమాన్ దేవాలయ పునర్నిర్మాణానికి ముస్లిం దాత షేక్ భాషా సహకారం అందించడం సామాజిక ఐక్యతకు చక్కటి ఉదాహరణగా నిలిచింది. ఆలయ నిర్మాణంలో భాగంగా ఆయన రూ.4-5 లక్షల విలువైన గ్రానైట్ టైల్స్‌ను అందించారు.

కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ దేవాలయ నిర్మాణానికి స్థానిక దాతలు సహకరించగా, మొత్తం రూ.1.30 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. శంషాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండి గోపాల్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి.షేక్ భాషా మాట్లాడుతూ, తాను కర్నూలు నుంచి వచ్చి శంషాబాద్‌లో స్థిరపడి ప్రజల సహకారంతో ఎదిగానని, అదే కృతజ్ఞతతో కులమతాలకు అతీతంగా ఆలయ నిర్మాణానికి సహాయం చేశానని తెలిపారు. “మనుషులందరూ ఒక్కటే” అన్న సందేశాన్ని ఆయన ఇచ్చారు.బండి గోపాల్ యాదవ్ మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా షేక్ భాషా చేసిన సహాయం ప్రత్యేకమని కొనియాడారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media