వైన్స్ షాపులకు దేవుళ్ల పేర్లు ఉపయోగించడాన్ని నిషేధించాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఆయన సూచించారు.
దేవుని పేర్లు మద్యం దుకాణాలకు ఉపయోగించడం భక్తుల భావోద్వేగాలను దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి పేర్లను పూర్తిగా నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని ఆయన కోరుతూ, ధార్మిక విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
