కడపలో EVM గోడౌన్ల తనిఖీ:రాజకీయ పార్టీల సమక్షంలో కలెక్టర్

March 26, 2026 4:38 PM

కడప జిల్లాలో ఈవీఎంల భద్రతపై భాగంగా త్రైమాసిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ భవన సముదాయంలోని ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు.

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లలో భద్రతా ఏర్పాట్లు, నిర్వహణ పరిస్థితులను సమీక్షించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటపతి, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, ఆప్, జనసేన పార్టీల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media