Vijayawada సమీపంలోని నందివాడ మండలం ఆత్కూరులో డ్రైన్ పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. రూ.40 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనులను Venigandla Ramu ప్రారంభించారు.

పెడలింగాల గ్రామం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే, డ్రైన్లో పూడిక కారణంగా వరదల సమయంలో గ్రామాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు.ఈ పనులు పూర్తయ్యాక నందివాడ మండలంలోని పలు గ్రామాల్లో వరద ముంపు తగ్గుతుందని, తుఫాన్లు, భారీ వర్షాల సమయంలో గ్రామాలు సురక్షితంగా ఉంటాయని చెప్పారు. ఆక్వా రైతులకు కూడా ఈ పనులు ఉపయోగకరమవుతాయని వెల్లడించారు.గతంలో కాలువలు, డ్రైన్ల నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల సమస్యలు పెరిగాయని, ప్రస్తుతం వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
