ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న జ్ఞానభూమి పోర్టల్‌కు ప్రతిష్టాత్మక స్కోచ్ ప్లాటినం అవార్డు లభించింది.
ఢిల్లీలో జరిగిన 106వ Skoch Awards కార్యక్రమంలో ఈ అవార్డును B. Lavanya Veni స్వీకరించారు.జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టల్ అడ్మిషన్లు, అంబేద్కర్ ఓవర్సీస్, విద్యోన్నతి వంటి పథకాలు రియల్ టైంలో అందిస్తున్నందుకు ఈ అవార్డు దక్కింది.ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి Dola Sri Bala Veeranjaneya Swamy అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పేద విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
