అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసింది . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు.

అమరావతికి ప్రాచీన చరిత్ర ఉందని, శాతవాహనుల కాలంలోనే ఇది కీలక కేంద్రంగా ఉన్నదని పేర్కొన్నారు. తెలుగు జాతి గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు ఇది ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.రాష్ట్ర విభజన తర్వాత త్వరితగతిన సొంత రాజధాని నిర్మాణం అవసరమైందని, రైతులు స్వచ్ఛందంగా వేల ఎకరాల భూములను ఇచ్చి సహకరించారని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.రాజధాని అభివృద్ధి ప్రక్రియలో ఆటంకాలు ఎదురయ్యాయని, గతంలో కొన్ని రాజకీయ కారణాలతో ప్రగతి ఆగిపోయిందని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టాలని స్పష్టం చేశారు.

