తిరుపతిలోని Sri Kodandarama Swamy Temple వద్ద శ్రీ కోదండరామస్వామి వారి తెప్పోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

శ్రీరామచంద్ర పుష్కరిణిలో విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతారామలక్ష్మణులు ఆశీనులై ఐదు ప్రదక్షిణలు చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకకు విశేష సంఖ్యలో భక్తులు హాజరై కర్పూర నీరాజనాలు సమర్పించారు.ఉత్సవాల భాగంగా ఉదయం స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను పుష్కరిణికి వేంచేపు చేసి రాత్రి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించిన ఈ వేడుకలు తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.
