తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి Nara Chandrababu Naiduతో ఎస్టీ మహిళ భావోద్వేగంగా మాట్లాడిన ఘటన ఆకట్టుకుంది.వెంకటగిరి మండలం గుండ్లసముద్రం ఎస్టీ కాలనీకి చెందిన సుబ్బమ్మ, ప్రభుత్వం మరియు టీవీఎస్ ట్రస్ట్ సహకారంతో తమ జీవితం ఎలా మారిందో వివరించారు. ఇళ్లు, తాగునీరు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో తమ కుటుంబం స్థిరపడిందని తెలిపారు.
“చంద్రన్నా… మా ఇంటికి రాన్నా” అంటూ సీఎంను ఆహ్వానించిన ఆమెకు, తప్పకుండా వస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
