గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన పెంచడం, అవయవ దానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం ప్రతి ఆర్ఎంపీ వైద్యుడి బాధ్యత అని జాతీయ ఆర్ఎంపీ వైద్యుల సంఘం ఎఫ్సీపీఎంపీ వ్యవస్థాపకుడు యు.బి.టి రాజు అన్నారు.
భీమునిపట్నంలోని చిట్టివలసలో జరిగిన రాష్ట్ర ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టిషనర్ అసోసియేషన్ తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన లోపమే మరణాలకు కారణమవుతోందని పేర్కొన్నారు.గ్రామీణ ప్రజలకు క్యాన్సర్ లక్షణాలపై ముందస్తు సమాచారం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. అలాగే అవయవ దానం ద్వారా అనేక మందికి ప్రాణదానం చేయవచ్చని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
