రిమ్స్‌లో 50 ఏళ్లు దాటిన కార్మికుల తొలగింపు వివాదం:CITU నిరసన

March 31, 2026 11:33 AM

కడప శివారులోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో 50 సంవత్సరాలు దాటిన శానిటేషన్ కార్మికులను తొలగించడం అన్యాయమని సిఐటియు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప కలెక్టరేట్ వద్ద సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ, రిమ్స్ ప్రారంభం నుంచి పనిచేస్తున్న సుమారు 111 మంది కార్మికులను తొలగించడం దుర్మార్గమని అన్నారు. కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు పై కఠిన చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టును బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు పూర్తిగా ఇవ్వడం లేదని, పీఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపించారు. మూడు నెలలుగా వేతనాలు బకాయి ఉన్నాయని తెలిపారు. వెంటనే తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media