ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని దర్శించిన అనంతరం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంటిమిట్టకు ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిని కేంద్రంగా కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాష, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆలయ దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, తిరుమల తిరుపతి దేవస్థానం మరియు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఒంటిమిట్ట కోదండ రామాలయం ప్రాచీన క్షేత్రమని, రాష్ట్ర విభజన తర్వాత అధికారికంగా గుర్తింపు పొందిందని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒంటిమిట్టకు ప్రత్యేక స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.
