కడప జిల్లా ఒంటిమిట్టలో ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 ఉదయం 9 గంటల నుంచి 2వ తేదీ ఉదయం 8 గంటల వరకు అమల్లో ఉంటాయి.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కడప–తిరుపతి, రాజంపేట మార్గాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించనున్నారు. కడప నుంచి తిరుపతి వెళ్లే వాహనాలు ఊటుకూరు–రాయచోటి మార్గంలో వెళ్లాలని సూచించారు.భక్తుల వాహనాల పార్కింగ్ కోసం మొత్తం 18 ప్రదేశాలు ఏర్పాటు చేశారు. కడప వైపు 13, రాజంపేట వైపు 5 పార్కింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
