దివ్యాంగ పిల్లల గుర్తింపు అంగన్వాడి కార్యకర్తల బాధ్యత

March 31, 2026 1:10 PM

ఈస్ట్ గోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని పెనికేరు గ్రామంలో అంగన్వాడి కార్యకర్తలకు దివ్యాంగ పిల్లల త్వరిత గుర్తింపు, సమన్వయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారా సిబిఆర్ కోఆర్డినేటర్ బడుగు మహిమారావు మాట్లాడుతూ మూడు సంవత్సరాల లోపు అంగవైకల్యం గల పిల్లలను తొందరగా గుర్తిస్తే తగిన చికిత్సతో వికలాంగత్వ తీవ్రతను తగ్గించవచ్చని తెలిపారు.

వివిధ రకాల అంగవైకల్యాలను ఎలా గుర్తించాలి అనే అంశంపై వివరించారు. ల్యాంప్ అడ్వకేసి కోఆర్డినేటర్ బడుగు సుబ్బాయమ్మ దివ్యాంగులకు అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలు, స్పెషల్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య, వైద్య సేవలు, పెన్షన్లు మరియు 2016 దివ్యాంగుల చట్టంపై అవగాహన కల్పించారు.ఐసిడిఎస్ సూపర్వైజర్ సత్యవేణి మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలకు ఇలాంటి శిక్షణలు ఎంతో ఉపయోగకరమని, సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media