పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విద్యుత్ బకాయిల కారణంగా పలు కాలనీలకు సరఫరా నిలిపివేయడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. మాచర్లలోని పిడబ్ల్యుడి కాలనీ, విజయపురి సౌత్ కాలనీలకు విద్యుత్ శాఖ అధికారులు సరఫరాను నిలిపివేశారు.

విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎండ తీవ్రతలో కాలనీల నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.పూర్వ బకాయిలను పూర్తిగా చెల్లించిన తర్వాతే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ప్రజలు బకాయిల సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.
