AP:మిరియాల గ్రామంలో కార్డెన్ సెర్చ్ 30 వాహనాలు స్వాధీనం

March 31, 2026 2:13 PM

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలం మిరియాల గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గురజాల డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలు ఉద్రిక్తతకు దారితీయకుండా ముందస్తు చర్యల భాగంగా చేపట్టారు.

తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కత్తులు, గొడ్డళ్లు, గడ్డపారలు, కర్రలు, కొడవళ్లు వంటి ప్రమాదకర వస్తువులను గుర్తించారు.ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న గ్రామం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా ఈ కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media