AP:మైదుకూరులో పి4 ప్రథమ వార్షికోత్సవ వేడుకలు..

March 31, 2026 3:49 PM

కడప జిల్లా మైదుకూరులో ‘స్వర్ణ ఆంధ్ర 2047’ విజన్‌లో భాగంగా పి4 కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో పి4 అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు కార్యదర్శులు, 18 మంది సచివాలయ సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు.

ఈ సందర్భంగా పి4 జీరో పావర్టీ కార్యక్రమం ద్వారా గత ఏడాది కాలంలో సాధించిన పురోగతిపై సమీక్ష నిర్వహించారు. విద్య, ఆరోగ్య రంగాల్లో మరింత దృష్టి సారించి సమగ్ర అభివృద్ధి సాధించేందుకు కృషి చేయాలని సీఎస్ఓ బి. ఆదిశేష రెడ్డి సూచించారు.ఎం.బి.కె 10-20 లక్ష్యంపై వివరిస్తూ, సమాజంలో ఉన్న అధిక ఆర్థిక స్థితి గల 10 శాతం మంది, తక్కువ ఆదాయ వర్గానికి చెందిన 20 శాతం కుటుంబాలను దత్తత తీసుకొని వారి అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి యంగ్ ప్రొఫెషనల్ వినోద్ కుమార్ పువ్వాడి అధ్యక్షత వహించగా, సీఎస్ఓ బి. ఆదిశేష రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ఏపీ రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, వివిధ మండలాల ఎంపీడీవోలు, అధికారులు, మార్గదర్శులు, బంగారు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media