IIT, నీట్ ర్యాంకుల కోసం ప్రత్యేక శిక్షణ..మంత్రి లోకేష్

April 2, 2026 11:13 AM

రాష్ట్రంలో ఐఐటి, నీట్ ర్యాంకులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించారు. ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచనలు చేశారు.

ప్రతి ప్రాంతంలో రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీల్లో ప్రత్యేక కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించాలని పేర్కొన్నారు. అలాగే ఇంటర్మీడియట్‌లో డ్రాపౌట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ పాఠశాలలను త్రీస్టార్ రేటింగ్‌కు తీసుకెళ్లేలా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని, “మనబడి–మన భవిష్యత్తు” కింద నిధులను సమీకరించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై రాజీ ఉండదని హెచ్చరించారు.స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా లక్షలాది మందికి శిక్షణ, ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో నిర్మాణ రంగం సహా పలు రంగాల్లో మరిన్ని అవకాశాలు సృష్టించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.విద్యా ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media