ఉమ్మడి నెల్లూరు జిల్లా డక్కిలి మండలం దేవుడు వెల్లంపల్లిలో జరిగే శ్రీ స్థంబాలగిరీ స్వామివారి తిరునాళ్లను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు.

తిరునాళ్ల సందర్భంగా సుమారు 25 వేల నుంచి 30 వేల మంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా బస్సుల సంఖ్యను 16 నుంచి 25కు పెంచారు. వెంకటగిరి, శ్రీకాళహస్తి, రాపూరు ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు.పార్కింగ్, ట్రాఫిక్, లైటింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుడికి కిలోమీటర్ దూరంలో అన్ని సౌకర్యాలతో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. తిరునాళ్ల సమయంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ‘స్వచ్ఛ రథం’ వాహనాన్ని ప్రారంభించారు.అలాగే తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజలు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
