పాయకరావుపేటలో NTR భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం

April 2, 2026 11:22 AM

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 76, 77వ బూత్‌ల పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగానే పింఛన్ పంపిణీ కొనసాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వేములపూడి అప్పారావు, దువ్వు శ్రీనివాస్ యాదవ్, బోడపాటి శ్రీను, ఎమ్మిలి దుర్గ ప్రసాద్, కుంచ ప్రసాద్, వర్షాల మురళి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media