నక్కపల్లి Z.P పాఠశాలలో హోం మంత్రి అనిత ఆకస్మిక తనిఖీ

April 2, 2026 11:31 AM

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు.

వంటశాలను సందర్శించిన మంత్రి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆరో తరగతి చదువుతున్న ప్రవీణ్ అనే విద్యార్థికి స్వయంగా భోజనం వడ్డించడం ప్రత్యేకంగా నిలిచింది.పాఠశాలలో మౌలిక వసతులు, పరిశుభ్రతపై విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించిన మంత్రి, భోజన ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media