చేజెర్లలోACB దాడి.. రూ.32 వేలు లంచం తీసుకుంటూ VRO అరెస్ట్

April 2, 2026 11:53 AM

నెల్లూరు జిల్లా చేజెర్ల మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడి చేసి విఆర్వోను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.

దొరువుపాడు గ్రామానికి చెందిన విఆర్వో వంశీ, గ్రామస్థుడు అంజిబాబు భూమి సంబంధిత పనికి రూ.32 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితుడు అంజిబాబు ఏసీబీకి ఫిర్యాదు చేయగా, అధికారులు ముందస్తు ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహించారు.ఆదురుపల్లి టీ స్టాల్ వద్ద లంచం తీసుకుంటున్న సమయంలో విఆర్వోను పట్టుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని చేజెర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media