రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజిటర్స్ గ్యాలరీలో లోక్సభ సభ్యులతో కలిసి కూర్చొని ఆయన చర్చను ప్రత్యక్షంగా వీక్షించారు.
చర్చ ప్రారంభం నుండి ముగింపు వరకు శ్రద్ధగా గమనించిన లోకేష్, అమరావతి అంశంపై జరుగుతున్న పరిణామాలను ఆసక్తిగా పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ తరపున ఈ చర్చలో మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని తన అభిప్రాయాలను వెల్లడించారు.అమరావతి రాజధాని అంశం పై పార్లమెంట్లో జరుగుతున్న చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
