తిరుమల అన్న ప్రసాదం వార్షికోత్సవం

April 6, 2026 8:33 PM

తిరుమల లో శ్రీ వేంకటేశ్వర స్వామి అన్న ప్రసాదం క్యాంటిన్ లో వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. 1985 ఏప్రిల్ 6న అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఈ మహోన్నత కార్యక్రమం నేటితో 39 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం కేవలం 2 వేల మంది భక్తులతో మొదలైన ఈ సేవ, నేడు రోజుకు 2.80 లక్షల మందికి అన్నప్రసాదం అందించే స్థాయికి చేరడం విశేషం.

ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. భక్తుల భాగస్వామ్యం, దాతల సహకారంతో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ మూల నిధి రూ.2,500 కోట్లు దాటిందని తెలిపారు. ఈ పథకం స్ఫూర్తితోనే ప్రాణదానం, విద్యాదానం వంటి ట్రస్టులను ఏర్పాటు చేసి టీటీడీ ద్వారా వైద్య, విద్యా రంగాల్లో సేవలు అందిస్తున్నామని వివరించారు.

ప్రస్తుతం టీటీడీ పరిధిలోని మరో 60 దేవాలయాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాల్లోనూ నిత్యాన్నదానం పథకాన్ని అమలు చేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు జరిగిన ప్రగతిని వివరిస్తూ చంద్రబాబు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను కూడా పంచుకున్నారు. 


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media