గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు బానిసైన వారికి మెరుగైన చికిత్స అందించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పేర్కొన్నారు.

నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మత్తు విముక్తి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న సౌకర్యాలు, చికిత్స విధానం, కౌన్సెలింగ్ మరియు మందుల పంపిణీపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, మత్తు పదార్థాల అలవాట్ల నుంచి బయటపడేందుకు త్వరలోనే జిల్లాలో ప్రత్యేక డీ-అడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా మత్తు పదార్థాలకు అలవాటు పడటం జీవితాలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. ప్రజలు ఈ అలవాట్లకు దూరంగా ఉండి కుటుంబం, సమాజానికి తోడ్పాటు అందించాలని సూచించారు.

