ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, అభివృద్ధి సంబంధిత సమస్యలను అర్జీల రూపంలో వినిపించారు. ప్రతి అర్జీని పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.సమస్యలపై తక్షణ స్పందనతో చర్యలు తీసుకోవడం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
