గుంటూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి MLA నక్క ఆనంద్ బాబు

April 14, 2026 11:39 AM

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గుంటూరు లాడ్జి సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఆయనతో పాటు మద్దిరాల మ్యాని క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేద్కర్ సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media