అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ పోలీస్ స్టేషన్‌కు సబ్ ఇన్స్పెక్టర్‌గా టి. మల్లేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు.

నక్కపల్లి నుంచి బదిలీపై వచ్చిన ఆయన, సోమవారం తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకులోయలో శాంతిభద్రతలు కాపాడటానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.మండల ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ “మీ పోలీస్ మీకోసం” నినాదాన్ని అమలు చేస్తానన్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తామని చెప్పారు.ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నేర రహిత అరకును నిర్మించడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.ప్రజలు ఎటువంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
