పూర్వ విద్యార్థి సేవా చైతన్యం… APR కళాశాలకు ₹1 లక్ష విరాళం

April 14, 2026 12:04 PM

చింతపల్లి APR కళాశాలకు పూర్వ విద్యార్థి డాక్టర్ జర్ర అప్పారావు సేవాభావాన్ని చాటుతూ రూ.1 లక్షల విరాళాన్ని అందజేశారు. కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో ఆయన ఈ చెక్కును పూర్వ విద్యార్థుల సంఘానికి అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తన జీవితానికి మార్గదర్శకత్వం చూపిన గురువులు, విద్యనందించిన కళాశాలను ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. వారి ఋణం తీర్చలేనిదని చెప్పి, పూర్వ అధ్యాపకులను సన్మానిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.కళాశాల అభివృద్ధికి తన వంతు బాధ్యతగా ఈ విరాళాన్ని అందిస్తున్నానని, భవిష్యత్తులో కూడా సహాయం కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామేశ్వరం, కమిటీ సభ్యులు యు.వి. గిరి, కుడుముల వెంకటరమణ, జి. పద్మనాభం, జి. మోహనరావు, సి.హెచ్. విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media