TG:నల్లగొండలో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి

April 14, 2026 1:12 PM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికీ చట్టబద్ధమైన హక్కులు, విధులు కల్పించి అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలు అపారమని కొనియాడారు. సామాజిక న్యాయం సాధనలో ఆయన చూపిన దారి నేటి తరానికి ఆదర్శమని, ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media