Skating పోటీల్లో మెరిసిన బేతని స్కూల్ విద్యార్థులు

April 14, 2026 2:13 PM

P.M పాలెం సమీపంలోని బేతని స్కూల్ విద్యార్థులు స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు.

కొమ్మాది లోని సిల్వర్ ఓక్స్ స్కూల్‌లో నిర్వహించిన రెండవ ఇంటర్ స్కూల్ స్కేటింగ్ పోటీల్లో కళ్యాణ్ రోలర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు జి. ఇషాంత్ (7వ తరగతి) అండర్-12 విభాగంలో రెండో స్థానం సాధించి సిల్వర్ మెడల్ గెలుచుకోగా, బి. సేవిత హర్షిణి (9వ తరగతి) అండర్-14 విభాగంలో మూడో స్థానం సాధించి బ్రాంజ్ మెడల్ పొందింది.ఈ సందర్భంగా విజేతలను బేతని పాఠశాల ప్రిన్సిపల్ పి. సునీత అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే కోచ్‌లు కె. కళ్యాణ్, వి. రవికుమార్ క్రీడాకారులను అభినందించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media