నల్లగొండ జిల్లా సూర్యాపేటలో డాక్టర్ B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ Tejas Nand Lal Pawar పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కలెక్టర్ మాట్లాడుతూ, రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించిన మహనీయుడని కొనియాడారు.చిన్నతనం నుంచి వివక్షను ఎదుర్కొన్న అంబేద్కర్, సమానత్వం కోసం చేసిన కృషి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వం సాధనకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, విద్య మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

