పాడేరులో ఉపాధ్యాయుల ధర్నా పోస్టర్ల ఆవిష్కరణ

April 15, 2026 11:19 AM

అల్లూరి జిల్లా పాడేరు ఐటిడీఏ కార్యాలయం ఎదుట ఈ నెల 21న నిర్వహించనున్న ఉపాధ్యాయ సమస్యల సాధన ధర్నా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం చింతపల్లి సీహెచ్ స్కూల్ ఆవరణలో ఆవిష్కరించారు.

జిల్లా పీఆర్‌టీయూ అధ్యక్షులు యు.వి. గిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామరాజు పడల్, సూర్యనారాయణ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ నాయకులు తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.PRC కమిషన్‌ను వెంటనే నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ రద్దు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలను గ్రేడ్-1 హెచ్‌ఎంలుగా మార్పు చేయాలని కోరారు.ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media