నల్లగొండలో ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

April 15, 2026 11:33 AM

నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం రాశులు, రికార్డులు, ఇప్పటివరకు కొనుగోలు చేసిన వివరాలను పరిశీలించారు.

రైతులతో మాట్లాడిన కలెక్టర్, తేమ లేకుండా మరియు నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. పూర్తి నాణ్యత కలిగిన ధాన్యానికి మాత్రమే మద్దతు ధర లభిస్తుందని తెలిపారు.జిల్లాలో రబీ సీజన్‌లో 426 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 286 కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. మిగిలిన కేంద్రాలను ఈ వారం లోపు ప్రారంభిస్తామని వెల్లడించారు.మిల్లర్లు ధాన్యం అన్‌లోడ్ విషయంలో ఆలస్యం చేయకుండా వెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media