Thimmapur గ్రామ పంచాయతీ సెక్రటరీపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. విధులు సక్రమంగా నిర్వహించకపోవడంతో పాటు సమస్యలు అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
గ్రామంలో వృద్ధులకు పెన్షన్ అందడం లేదని, నీటి సమస్యలు, మురుగు కాలువల సమస్యలు పరిష్కారం కాకపోతున్నాయని గ్రామస్తులు తెలిపారు. సమస్యలపై ప్రశ్నిస్తే “మీకు నచ్చినచోట చెప్పుకోండి” అంటూ స్పందిస్తున్నారని ఆరోపించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత సెక్రటరీని తొలగించి కొత్త సెక్రటరీని నియమించాలని గ్రామ ప్రజలు ఎంసీడీఓ అధికారికి వినతి పత్రం సమర్పించారు.

