AP:పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారం కలెక్టర్ విజయ క్రిష్ణన్

April 16, 2026 10:05 AM

జిల్లాలో పరిశ్రమల నిర్వహణకు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఐఈపీసీ సమావేశంలో ఆమె అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పారిశ్రామిక అనుమతులు, యూనిట్లకు అందించాల్సిన ప్రోత్సాహకాలపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని, సింగిల్ డెస్క్ పాలసీ కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి మౌలిక సదుపాయాలు, రుణసహాయం కల్పించాలని, మంజూరైన యూనిట్లు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పారిశ్రామిక వాడల్లో అవస్థాపన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సౌర్య మన్ పటేల్, ఆర్డీవో ఆయేషా, పరిశ్రమల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media