MVR సేవలను కొనియాడిన ఆడారి ఆనంద్ కుమార్ BJP నేతల భేటీ

April 16, 2026 10:12 AM

జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామంగా బీజేపీ అగ్రనేతల అపూర్వ భేటీ జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త, ఎంవీఆర్ ట్రస్ట్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎంవీఆర్) బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడారి ఆనంద్ కుమార్‌ను విశాఖలో మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం సత్కరించుకొని, ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.ఎంవీఆర్ సేవలను కొనియాడిన ఆడారి ఆనంద్ కుమార్, “మీ వంటి నాయకులు పార్టీలోకి రావడం బీజేపీకి మరింత బలం చేకూరుస్తుంది” అని వ్యాఖ్యానించారు. ఎంవీఆర్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవలను ఆయన ప్రశంసించారు.దీనికి స్పందించిన ఎంవీఆర్, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media