జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ అధ్యక్షతన నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, పెండింగ్ కేసుల పరిష్కారం పై కీలక ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించిన ఎస్పీ, హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, రాంగ్ రూట్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ చలానాలు చెల్లించని వాహనాలను సీజ్ చేసి, లైసెన్స్ రద్దుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.నేషనల్ హైవేలు మరియు ప్రమాదకర ప్రాంతాల్లో సురక్షిత చర్యలు, సైన్‌బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సెజ్ ప్రాంతాలు, బ్రాండిక్స్ బస్సు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్పారు.రౌడీ షీటర్లపై కఠిన పర్యవేక్షణ, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఎన్‌డీపీఎస్ కేసుల్లో పునరావృత నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంచుతూ CCTNS, ఫేస్ రికగ్నిషన్, ఈ-సాక్ష్య వంటి వ్యవస్థలతో కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు.స్మార్ట్ పోలీసింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఎస్పీ ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
