ఈనెల 23న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. రాంబిల్లి సెజ్‌లో రెన్యూ ఫోటోవోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్లో జరిగిన సమన్వయ సమావేశంలో సుమారు 10 నుంచి 20 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తూ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలని సూచించారు. సభా వేదిక, వీఐపీ గ్యాలరీలు, పార్కింగ్, ఎల్ఈడీ స్క్రీన్లు వంటి ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రజల రవాణాకు సుమారు 200 బస్సులు ఏర్పాటు చేసి, తాగునీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, మజ్జిగ కేంద్రాలు, మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు.భద్రత పరంగా సీసీటీవీ పర్యవేక్షణ, ప్రత్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు

