మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

April 16, 2026 11:53 AM

మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉంది.

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్న బొలెరో గూడ్స్ వాహనం ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో 16 మందికి పైగా భక్తులు ఉన్నారు.

ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా, ఆసుపత్రికి తరలించిన తర్వాత మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఆరుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.గాయపడిన వారిలో 9 మందిని కర్నూలుకు తరలించగా, అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు ఎమ్మిగనూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మృతులు కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లా తరికి తాలూకా ఉడయి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  1. కుమార్ s/o late ఎల్లయ్య, 50 సం. kanayakana Halli Village, chikmanguloir Town.
  2. Deepika Veena w/o Rajesh, age 42, years, kanayakana Halli Village, chikmanguloir Town.
  3. Sunil s/o Kumar, age 40 years, chettihalli village,
  4. Yashoda @thayamma w/o Kumar, age.60 years, chettihalli Village
  5. Puttamma w/o jaganathappa, age. 55 years, uddeva village,
  6. Lolakshi , chettihalli village, belur thaluka
  7. Meenakshi w/o Ranga, uddeva village,
  8. Belli D/o Deepika Veena, age 5 years.
    Kanayakana Halli village


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media