నెల్లూరులో land fraud బంధువులపై బాధితుల ఫిర్యాదు

April 16, 2026 12:12 PM

నమ్మిన బంధువులే మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్న ఘటన రాపూరు మండలం తెగచర్ల గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

బాధితుల వివరాల ప్రకారం, 2015లో 1.5 ఎకరాల భూమిని రూ.6 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుని, రూ.5.5 లక్షలు చెల్లించారు. అయితే రిజిస్ట్రేషన్ విషయంలో ఆలస్యం చేస్తూ, 2022లో ఆ భూమిని మరో వ్యక్తి పేరుకు మార్పిడి చేసినట్లు తెలిసింది.ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తుండగా, ఇటీవల కొంతమంది వచ్చి భూమిలో చెట్లు తొలగించి, ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసినట్లు బాధితులు తెలిపారు. అడ్డుకున్న వారిపై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపించారు.ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media