రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం రాహత్’ పథకం కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి, ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో వైద్యం అందితే ప్రాణాలను రక్షించే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, అజాగ్రత్త ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.ప్రతి 100 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ, బాధితులకు వేగంగా చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
