ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డీఎస్పీ మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో డాక్యుమెంట్లు, స్టాంప్ డ్యూటీకి సంబంధించిన అవకతవకలపై పరిశీలనలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ వెంకట్ లాల్‌ను అధికారులు విచారిస్తున్నారు. తనిఖీల సమాచారం అందుకున్న కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ముందస్తుగా తమ సెటర్లను మూసివేసి పరారైనట్లు సమాచారం.ఈ దాడులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవకతవకలపై వెలుగులోకి తీసుకురానున్నాయని అధికారులు తెలిపారు.
