ఉండవల్లి గుహల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును అమరావతిలోని ప్రైవేట్ కాలేజీ బస్సు ఢీకొట్టింది.
స్థానికుల వివరాల ప్రకారం, ఉండవల్లి గుహల మలుపు వద్దకు చేరుకున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా అతివేగంగా వచ్చిన ప్రైవేట్ కాలేజీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ ఘటనలో ఆర్టీసీ బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.ప్రైవేట్ కాలేజీ బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.
