తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్నికైన ఎం.వి.వి. ప్రసాద్ ముత్యాలమ్మ ఆశీస్సులతో తన కొత్త రాజకీయ బాధ్యతలను ప్రారంభించారు.
చింతపల్లి ప్రాంత ప్రజల ఆరాధ్యదైవం శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా ఆయన ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంవీవీ ప్రసాద్‌కు ఘన సత్కారం జరిగింది.కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ముత్యాలమ్మ అమ్మవారి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పసుపులేటి వినాయకరావు, ఉపాధ్యక్షుడు పోతురాజు బాలయ్య మాట్లాడుతూ ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తున్న ప్రసాద్‌కు పార్టీ రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇవ్వడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, వైద్య నిపుణులు, టీడీపీ నాయకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
